Cream Fungus: ఇండియాలో క్రీమ్ ఫంగస్ కేసు.. ఎలా వచ్చింది.. రాకుండా ఏం చెయ్యాలి?
Cream Fungus: బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్.. తెలుసు... ఈ క్రీమ్ ఫంగస్ ఏంటి... దీనికీ ఐస్‌క్రీమ్‌కీ సంబంధం ఉందా? ఇది కూడా ప్రమాదకరమైనదే అని డాక్టర్లు ఎందుకు అంటున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Cream Fungus: మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే... చెత్తా చెదారం పెరిగిపోయి... బొద్దింకలు, చీమలు, ఎలుకలు, చెద పురుగులు... వంటివి వచ్చేస్తాయి కదా... అలాగే... ఈ భూమిని మనం చెత్తా చెదారంతో, సముద్రాలను ప్లాస్టిక్ వ్యర్థాలతో నింపేస్తూ ఉంటే... విపరీతమైన కాలుష్యం వల్ల... రకరకాల వైరస్‌లు, ఫంగస్‌లు, బ్యాక్టీరియా యాక్టివ్ అయ్యి... మనపై దాడి చేయడం సహజం అనే వాదన వినిపిస్తోంది. అది నిజమే అన్నట్లుగా... కరోనాలోనే రకరకాల వేరియంట్లు దాడి చేస్తుంటే... అవి చాలవన్నట్లు... ఈ ఫంగస్‌ల గోల ఎక్కువైంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లాగానే ఇప్పుడు కొత్తగా క్రీమ్ ఫంగస్ దాడి చేసింది. దీన్ని మధ్యప్రదేశ్... జబల్పూర్ జిల్లాలో... ఓ పేషెంట్‌లో గుర్తించారు. అదే పేషెంట్‌కి ఆల్రెడీ కరోనా సోకింది. బ్లాక్ ఫంగస్ కూడా సోకింది. అంటే... ఒకే వ్యక్తికి మూడు రకాల అనారోగ్యాలు ఎటాక్ చేశాయన...