UNDERGROUND TEMPLE IN BIDAR
600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేసే గుడి - బీదర్ లోని ఝరణి నరసింహక్షేత్రం
మనదేశం ఆత్యాధ్మిక నిలయం.మనస్సు ప్రశాంతంగా వుండటానికి మనము ఆలయాలను సందర్శిస్తూవుంటాం. అటువంటి ఆలయాలలో తప్పకుండా దర్శించుకొనవలసిన క్షేత్రం ఝరణీ నరసింహక్షేత్రం.
క్రీ.పూ 400 ల సం ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు కొలువైవున్నారని చెబుతున్నారు.మన దేశంలోని అన్ని ఆలయాల కన్నా ఈ క్షేత్రం దర్శించుకోటానికి ఒక ప్రత్యేకత వుంది
ప్రశాంతవంతమైన వాతావరణం నడుమ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు దగ్గరలో గల మంగళ్ పేట్ లో నరసింహక్షేత్రం వెలసింది.
ఒక గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్లి గర్భగుడిలో కొలువైనటువంటి ఝరణీ నరసింహస్వామిని దర్శించుకోవాలి.
స్వామి వారి పాదాల నుండి నీరు ప్రవహిస్తుండడంతో జల నరసింహస్వామి ఆలయమని పిలుస్తున్నారు.
స్థలపురాణం;-
ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్షసుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట .అప్పుడు లక్షీ నరసింహ స్వామి వచ్చి జలాసురుడిని సంహరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నారు నరసింహ స్వామి .ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసింహ స్వామి అక్కడ వెలిశి ' జలానరనరసింహుడు ' గా కొలవబడుతున్నాడు .
జలా అంటే నీరు కాబట్టి , నరసింహ స్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇలా 600 మీటర్ల లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే కానీ జాలా నరసింహుని సందర్శన సాధ్యం కాదు.
ఈ పుణ్య క్షేత్రం హైదరాబాదుకు 140 కి.మీ ల దూరంలో కలదు. ఝరణీ నరసింహక్షేత్రాన్ని మీరెప్పుడైనా సందర్శించుకున్నారా?
ఆలయ సమయాలు
ఉదయం 7 గంటలు నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది 🙏🙏
Comments
Post a Comment